
సుదీర్ఘ విరామం తరువాత, ఇప్పుడు టాలీవుడ్లో సినిమాల షూట్ ఇటీవల తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఎస్.ఎస్. రాజమౌళి తన రాబోయే మరియు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రీకరణను ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే చిత్ర పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, ఎస్.ఎస్.రాజమౌళి అన్నిటికీ సిద్ధంగా ఉన్నారట. అక్టోబర్ రెండవ వారం నుండి తన దర్శకత్వ వెంచర్ ఆర్ఆర్ఆర్ షూట్ ను తిరిగి ప్రారంభిద్దామని టీంకు చెప్పారట. ఆర్ఆర్ఆర్ చిత్రీకరణకు వందలాది మంది అవసరం. కానీ అది కరోనా నిబంధనలకు వ్యతిరేకం అందుకనే షూట్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మాత్రం జక్కన్న అన్నిటికి సిద్ధమయ్యి, కరోనా నిబంధనలకు అనుగుణంగా షూట్ ను ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.
Tags: #Ntr #Rajamouli #Ramcharan #RRR #Tollywood