
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఆర్ఆర్ఆర్' ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. టాలీవుడ్ అగ్ర నటులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సమరయోధులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం, రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ కోసం రెండు డేట్లను లాక్ చేశాడు. సినీ ప్రేమికులు, అభిమానులు రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆర్ఆర్ఆర్ మేకర్స్ గత కొన్ని నెలలుగా వారిని వెయిట్ చేయిస్తూనే ఉన్నారు. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్లను వరుసగా వారి పుట్టినరోజున విడుదల చేయడానికి ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మార్చి 27 మరియు మే 20 తేదీలను నిర్ణయించినట్లు మేకర్స్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.