
మహేష్ బాబు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నాడని చాలా కాలం నుంచి వార్తల్లో ఉంది. వీరిద్దరి కాంబో కోసం అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో జతకట్టనున్నారు. అయితే, ఇది కూడా మల్టీస్టారర్ అని పెద్ద బడ్జెట్లో నిర్మించబడుతుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబు, ప్రభాస్‌లతో కలిసి సినిమా చేస్తారని, ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తారని టాక్. మహేష్ బాబు, తన తాజా చిత్రం 'సరిలేరి నీకెవ్వరు' సినిమా ఇచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే నెక్స్ట్ వంశీ పైడిపల్లితో సినిమా ఓకే చేశాడు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సమాచారం నిజమై, రాజమౌళి దర్శకత్వంలో మహేష్-ప్రభాస్ సినిమా వస్తే...రికార్డులు బద్దలవ్వటం ఖాయం!