
నిన్న హైదరాబాద్ మా అసోసియేషన్ నిర్వహించిన 'మా' నూతన డైరీ ఆవిష్కరణ ఈవెంట్ రసాభాసగా సాగింది. సరదాగా సాగాల్సిన ఈవెంట్ క్షమాపణలు చెప్పే వరకు వెళ్ళింది. చిరంజీవి 'మంచి ఉంటే మైక్ లో చెప్పుకుందాం. చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం' అని అసోసియేషన్ గురించి అని స్పీచ్ ముగియగానే రాజశేఖర్ మైక్ తీసుకొని చిరంజీవి స్పీచ్ ను తప్పుపడుతూ మాట్లాడటంలో గందరగోళంగా మారింది. ఆ తర్వాత కొద్దిసేపటికే రాజశేఖర్ మా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఈవెంట్ లో జరిగిన పరిణామాలకు అతిధులకు క్షమాపణలు చెప్పారు. రాజశేఖర్ సోషల్ మీడియాలో "నిన్న ఏదైతే జరిగిందో అది కేవలం నాకు నరేష్ కు మధ్యే. మాలో ఇది సరిగ్గా, సవ్యంగా జరగట్లేదు. అది చూసి నేను నోరు మూసుకొని చూస్తూ ఉండలేను. నాకు...చిరంజీవి, మోహన్ బాబు గార్లతో ఎటువంటి మనస్పర్థలు లేవు. ఈవెంట్ లో జరిగిన అసౌకర్యానికి పెద్దలకు నా క్షమాపణలు" అని ట్వీట్ చేశారు.