
'మా' నూతన డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ కు కృష్ణంరాజు, మోహన్ బాబు, చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి, రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు. అయితే ఈవెంట్ మాత్రం సాఫీగా సాగలేదు. చిరంజీవి, రాజశేఖర్ మధ్య మాటల యుద్ధమే జరిగింది. రాజశేఖర్ తనకు విలువ ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి. అనంతరం మైక్ తీసుకున్న మోహన్ బాబు "రాజశేఖర్ ధోరణని ఖండించారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా పరిష్కరించే సుబ్బిరామిరెడ్డి లాంటి పెద్దల ముందు ఇలా మాట్లాడటం సరి కాదు. ఇక నేను తిరుపతిలో బీఏ చేస్తున్నప్పుడు కృష్ణంరాజు గారి సినిమాలు చూసేవాడిని. నాకు చిరంజీవికి ఎటువంటి విభేదాలు లేవు. మేమిద్దరం కలిసితే ఛలోక్తులు విసురుకుంటాం కానీ అది కూడా సరదాకే. నా కుటుంబం చిరంజీవిది, చిరంజీవి కుటుంబం నాది" అంటూ స్పీచ్ ముగించారు. అయితే మా డైరీ ఆవిష్కరణలో జరిగిన పరిణామాల కారణంగా రాజశేఖర్ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.