
సీనియర్ హీరో రాజశేఖర్ కు గత ఏడాది పెద్దగా కలిసిరాలేదని చెప్పాలి. గత ఏడాది యావత్ ప్రపంచానికే ప్రశ్నార్ధకరమైనా రాజశేఖర్ కు మాత్రం పునఃజన్మ అనే చెప్పాలి. ఒకసారి కార్ యాక్సిడెంట్ అయ్యి తృటిలో తప్పించుకున్నారు. ఆ తరువాత ఆయనతో సహా కుటుంబసభ్యులందరు కరోనా భారిన పడ్డారు. అందరూ త్వరగానే కోలుకున్నప్పటికీ హీరో మాత్రం ప్రాణాలతో జలగాటలాడి వచ్చారు. అవేవి రాజశేఖర్ ను ఆపలేదు. కోలుకొని మళ్ళీ రేటింపు ఉత్సాహంతో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రోజు రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన విడుదలైంది. రాజశేఖర్ 91వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘శేఖర్’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా, దీనికి మేన్ విత్ స్కేర్ అనే క్యాప్షన్ ఇచ్చారు. లలిత్ అనే దర్శకుడు సినిమాను తెరకెక్కించబోతున్నాడు. శేఖర్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్లో రాజశేఖర్ తెల్లని గుబురు గడ్డంతో సీరియస్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం మలయాళ మూవీకి రీమేక్ అని తెలుస్తుంది.