
2021 ఎన్నికలపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు
తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే పడిచచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రజనీ స్టైల్, గ్రెసే సపరేటు. ఆయన ఒక్క డైలాగ్ చెప్పాడంటే థియేటర్లలో కేకలు, ఈలలతో మోత మోగాల్సిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో 2.0 చిత్రంలో కనిపించిన రజినీ ప్రస్తుతం ఎ.ఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్న దర్బార్ లో నటిస్తున్నారు. రోబో 2.0 ఆశించిన రీతిలో ఆడలేదు...దీంతో రజనీ ఫ్యాన్స్ దర్బార్ పై ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటె, తాజాగా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన రజనీ తమిళనాడులో వచ్చే ఎన్నికల గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021 ఎన్నికల్లో అద్భుతాలు జరుగుతాయని తెలిపారు. తమిళ ప్రజలు 2021 ఎన్నికల్లో అద్భుతాలు సృష్టిస్తారని చెప్పిన రజనీ ఆ అద్భుతం ఏంటని మాత్రం చెప్పలేదు. ఇక కమల్ హాసన్ తో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే గెలిస్తే సీఎం ఎవరవుతారనేది అప్పుడు పరిస్థితులు నిర్ణయిస్తాయని తెలిపారు.