
ఈ ఏడాది ఎంత కష్టంగా, కఠినంగా ఉందొ కళ్లారా చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. కరోనా మహమ్మారి కొందరి పొట్టలు కొట్టింది, కొందరి జీవితాలను అల్లకల్లోలం చేసింది. అయితే జరుగుతున్న పరిస్థితులపై టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. ఈ ఏడాదంతా ఇదొక విపత్తుతో, చెడు వార్తలతో సాగుతుంది. నిమిషం నిమిషం భయపడ్తూ గడపాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో మరెన్నో విపత్తులను, రోగాలను, కష్ట కాలాలను ఎదురుకోవాల్సి వస్తుంది. అందరం దైర్యంగా ఉండు పోరాడదాం. కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్లాలని తెలిపింది. గత కొంతకాలంగా టాలీవుడ్లో రకుల్ హంగామా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. గతేడాది 'మన్మథుడు 2' సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత మరే సినిమా చేయలేదు.