
టాలీవుడ్, బాలీవుడ్లో పాపులర్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. మాదకద్రవ్యాల కుంభకోణానికి సంబంధించి ముంబైలో రకుల్ ప్రీత్ సింగ్ను ఎన్సిబి మూడు గంటలు ప్రశ్నించింది. మన్మదుడు 2 ఫేమ్ నటి శుక్రవారం తెల్లవారుజామున ఎన్సిబి కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తుంది. రకుల్ తో పాటు వాట్స్ యాప్ చాట్ లో ప్రస్తావించబడిన దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ మధ్యాహ్నం ఒంటిగంటకు ఏజెన్సీ ముందు హాజరయ్యారు. 2018 సంవత్సరంలో బెంగాలీ అమ్మాయి రియా చక్రవర్తితో డ్రగ్స్ గురించి మాట్లాడినట్లు నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సిబి ముందు ఒప్పుకున్నట్లు ఆ వర్గాల నుండి అందుతున్న సమాచారం. తాను చాట్ లో మాత్రమే పాల్గొన్నానని కానీ ఎప్పుడు డ్రగ్స్ తీసుకున్నది లేదని ఆమె ఎంసీబీతో చెప్పినట్లు తెలుస్తుంది.