
కరోనా మహమ్మారి కారణంగా ఎక్కడి వాళ్ళు అక్కడ, ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయి. అందులో మరి ముఖ్యంగా సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి, రిలీజ్లు ఆగిపోయాయి. దీని వల్ల ప్రొడ్యూసర్లకు పెద్ద బెబ్బ పడిందనే చెప్పాలి. చాలామంది ఓటిటి వైపు మొగ్గుచుపేసరికి ప్రొడ్యూసర్ల పరిస్థితి అయోమయంలో పడింది. అయితే, ఇదంతా ముగిసాకా కూడా ప్రొడ్యూసర్లు హీరో, హీరోయిన్లకు భారీ రెమ్యునరేషనలు ఇచ్చుకోలేని పరిస్థితి లో ఉంటారు. ఇది ముందుగా పసిగట్టిన రకుల్ ప్రీత్ సింగ్ తన రెమ్యునరేషన్ ను సగానికి తగ్గిస్తూన్నట్లు చెప్పింది. మాములుగా సినిమాకు 1.75 కోట్లు తీసుకునే రకుల్ ఇకపై 70 - 75 లక్షలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.