
డిజిటల్ మీడియా ఏ రేంజ్ లో వృద్ధి చెందుతుందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వెబ్ సిరీస్ లకు డిమాండ్ చాలా పెరిగింది. అందుకే పెద్ద నటి నటులు, స్టార్ డైరెక్టర్లు కూడా వెబ్ సిరీస్ తీసేందుకు సిద్ధ పడుతున్నారు.ఈ క్రమంలోనే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నా సమంత, కాజల్ అగర్వాల్ డిజిటల్ మీడియాలోకి అడుగు పెడుతున్నారు. వెబ్ సిరీస్ ద్వారా అభిమానులకు మరింత దగ్గర అవ్వొచ్చు, ఎక్కువ గుర్తింపు వస్తుందని గ్రహించిన ఈ ముద్దుగుమ్మలిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక విరితో పాటు మరో స్టార్ హీరోయిన్ కూడా డిజిటల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెబ్ సిరీస్ చేసే ఆలోచన ఉందా అని అడగగా...."చాలా కొత్తగా, ఈ పాత్ర నేను సినిమాల్లో చేయలేను అనుకుంటేనే చేస్తాను. నాకు వెండితెర అంటే ఇష్టం. డిజిటల్ మీడియా అనేది కొత్త ప్రపంచమని" చెప్పుకొచ్చింది.