
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. ఎంట్రీ సినిమానే హిట్ అవ్వడంతో అమ్మడుకి భారీగా ఆఫర్లు వచ్చి పడ్డాయి. స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం దక్కించుకుంది. కేవలం తెలుగులోనే కాక, తమిళ్, హిందీ ఇండస్ట్రీలలో కూడా తన సత్తా చాటింది. తర్వాత రకుల్ జోరు కాస్త తగ్గడంతో ముందస్తుగానే జాగ్రత్త పడుతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే మాటను రకుల్ తూచా తప్పకుండ ఫాలో అవుతుంది. ముంబై హీరోయిన్ అయినప్పటికీ హైదరాబాద్ లో తన డ్రీమ్ హౌస్ ను కొనుకొని మకాం మార్చేసింది. అంతే కాదు కుదిరినన్ని ఆస్తులు కూడబెట్టుకోవాలని ఫిక్స్ అయిందట. ఈమేరకు ఆమె బిజినెస్ అయిన ఎఫ్ 45 జిమ్ బ్రాంచ్లను విస్తరించే పనిలో పడింది. అంతేకాదు తాజాగా బెంగళూరులో ఒక ఖరీదైన ఫ్లాట్ కూడా తీసుకుందని సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ఆమె అక్కడ ఉండకపోయినా ఆస్తిలా ఉంటుందని ఆ ఫ్లాట్ కు రూ.6 కోట్లు కార్చుపెట్టిందట.