
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యాచలర్ సల్మాన్ ఖాన్ "దబాంగ్" సిరీస్ ను ఈమధ్యలో వదిలేలా కనిపియట్లేదు. దబాంగ్ కు మంచి క్రేజ్ ఉన్న కారణంగా ఇప్పుడు ప్రభుదేవా దర్శకత్వంలో "దబాంగ్ 3" ను తెరకెక్కించారు. సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా సోనాక్షి సిన్హా నటించింది. దక్షిణాదిలో కూడా మంచి క్రేజ్ ఉండటంతో దబాంగ్3 ను సౌత్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రోమోషన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ హాజరయ్యింది. అయితే సళ్ళు భాయ్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దగ్గుబాటి వెంకటేష్, కిచ్చా సుదీప్ లు అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సల్లు భాయ్ మాట్లాడుతూ... నాకు రామ్ చరణ్ చిన్నప్పటి నుంచి తెలుసు, మెగస్టార్ తో ఎన్నో ఏళ్ల సాన్నిహిత్యం ఉందని...ఇక వెంకీ మామది నాది 25 ఏళ్ల స్నేహం అని తెలిపారు. ఆ తరువాత సల్మాన్ ఖాన్ తో కలిసి రామ్ చరణ్, వెంకటేష్ లు స్టెప్పులేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.