
కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, నటులకు ఇది ఎన్నడూ ఊహించని విరామం. ఇన్ని నెలల పాటు ఇంటికే అంకితం అవ్వాల్సి వస్తుందని ఎవరు ఉహించి ఉండరు. అందుకనే ఈ ఖాళీ సమయంలో కుటుంబంతో ఉంటూ, వంటలు, వర్కౌట్లు చేస్తూ సమయం గడుపుతున్నారు. అలా, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రోజు ఉదయానే వర్కౌట్ తో చెమటలు కక్కిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR ' కోసం అందరూ చూస్తుండగా, ఈ కరోనా వచ్చి రిలీజ్ డేట్ ను మరింత వెనక్కి నెట్టింది. అయితే, ఎంత ఖాళీ సమయం దొరికినా మా హీరో మాత్రం అంతే ఫిట్ గా ఉన్నాడంటూ ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు.