
మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ' సినిమాతో రీఎంట్రీ ఇచ్చి గ్యాప్ లేకుండా సినిమాలను చేస్తున్న విషయం విదితమే. తాజాగా సురేందర్ దర్శకత్వంలో వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. వసూళ్ల పరంగా మాత్రం తెలుగులో వచ్చినంత మిగితా భాషల్లో రాలేదనే చెప్పాలి. కానీ సైరాలో మెగాస్టార్ ను చూసిన వారంతా ఈ వయసులో కూడా ఇలాంటి సినిమా చేయటం కేవలం చిరంజీవికే సాధ్యమంటూ ప్రశంసలు కురిపించారు. సైరా ఇచ్చిన కిక్ తోనే క్లాస్ డైరెక్టర్ కొరటాల శివతో తన తదుపరి సినిమా మొదలు పెట్టేసారు. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ నటించనున్నారని జోరుగా వార్తలు మొదలయ్యాయి. చిరు యుక్త వయసు సన్నివేశాలో రామ్ చరణ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతమాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సిందే.