
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా లాక్డౌన్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టిన జక్కన్న గ్యాప్ లేకుండా చిత్రీకరిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది మొదట్లో కొన్ని రోజుల పాటు ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు బ్రేక్ తీసుకొని తండ్రి చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య; సినిమాలో తన పాత్ర షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఆచార్య =లో రామ్ చరణ్ పాత్ర సుమారు 30 నిముషాలు ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు రామ్ చరణ్ కు జోడిగా ఒక హీరోయిన్ కూడా ఉందని సమాచారం. మొదట చెర్రీ హీరోయిన్ గా పలువురి పేర్లు వినిపించినా కొరటాల శివ మాత్రం ఎవరి ఊహకు అందకుండా ఒక కొత్త అమ్మాయిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. దానికి కారణం చరణ్ జోడిగా నటించే హీరోయిన్ పాత్ర కేవలం 5 నిముషాలు ఉంటుందని తెలుస్తుంది. దీంతో స్టార్ హీరోయిన్లు ఒప్పుకోరు కాబట్టి కొత్త హీరోయిన్ ను రంగంలోకి దింపారని టాక్.