
సురేందర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' తాజాగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. వసూళ్ల పరంగా మాత్రం తెలుగులో వచ్చినంత మిగితా భాషల్లో రాలేదనే చెప్పాలి. కానీ సైరాలో మెగాస్టార్ ను చూసిన వారంతా ఈ వయసులో కూడా ఇలాంటి సినిమా చేయటం కేవలం చిరంజీవికే సాధ్యమంటూ ప్రశంసలు కురిపించారు. సైరా ఇచ్చిన కిక్ తోనే క్లాస్ డైరెక్టర్ కొరటాల శివతో తన తదుపరి సినిమా మొదలు పెట్టేసారు. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ నటించనున్నారని జోరుగా వినిపిస్తుంది. చిరు యుక్త వయసు సన్నివేశాలో రామ్ చరణ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ కు లవ్ ట్రాక్ కూడా ఉందట. ఆ లవ్ ట్రాక్ కోసం మొదట సాయి పల్లవిని అనుకున్న టీం ఇప్పుడు కీయరా అద్వానీ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. గెస్ట్ రోలే కాబట్టి కీయరా కూడా ఒప్పుకునే అవకాశం ఉందని టీం భావిస్తున్నారు. మరి కీయరా అంగీకరిస్తుందో లేదో చూడాలి.