
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆర్ఆర్ఆర్, మరొకటి ఆచార్య. కరోనా లాక్ డౌన్ తర్వాత చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సెట్లలో చేరారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆచార్య షట్ లో కూడా పాల్గొననున్నాడు. అయితే చెర్రీ మార్కెట్ ఇప్పుడు మంచి ఊపు మీదుంది అందుకే యువ చిత్రనిర్మాతలు స్క్రిప్ట్‌లతో నటుడిని సంప్రదిస్తున్నారు కాని చరణ్ వారితో సినిమాలు చేసేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. వినయ విధేయ రామ వైఫల్యంతో, చరణ్ తాను ఎంచుకోబోయే స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. వరుస హిట్లు ఇచ్చిన వెంకీ కుడుములు మరియు వంశి పైడిపల్లి లాంటి దర్శకులను కూడా రామ్ చరణ్ రిజెక్ట్ చేసినట్లు సమాచారం. కధలో పట్టు లేకపోతే ఎంత హిట్లు ఇచ్చిన దర్శకులైన చరణ్ ఒప్పుకోవట్లేదనడానికి ఇదే ఉదాహరణ.