
సమంత అక్కినేని, శర్వానంద్ నటించిన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా 'జాను' ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది. శర్వానంద్, సమంత నటనపై సినీ ప్రేమికులు, విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'జాను' సినిమాపై స్పెషల్ గా అతనితో రంగస్థలంలో జతకట్టిన సమంత నటనపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'జాను' సినిమా చూసి ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “ప్రేక్షకులచే ముందే ఎంతో ప్రశంసించబడ్డ సినిమాను రీమేక్ చేయడం అంత తేలికైన పని కాదు. కానీ శర్వానంద్ మరియు సమంత అక్కినేని దీనిని అవలీలగా చేశారన్నారు. శర్వానంద్, సమంత, దర్శకుడు ప్రేమ్ కుమార్ మరియు నిర్మాత దిల్ రాజుకు అభినందనలు" అని సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ తెలిపాడు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు.