
సామాజిక అంశాలను తెరపై చూపడంలో దిట్ట అయిన కొరటాల శివతో చిరంజీవి సినిమా అనేసరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. సైరా ఫీవర్ నుండి బయటకు వచ్చేసి తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు చిరు. ఈ సినిమాకు కూడా రామ్ చరణే నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నాడు. మొన్నీమధ్యే చిరు టెస్ట్ లుక్ ను ఓకే చేసిన కొరటాల.... గత వారం షూటింగ్ మొదలు పెట్టారు. హైదరాబాద్ శివార్లలోని కోకాపేట్ లో మొదటి షెడ్యూల్ అనుకున్నట్లుగా పూర్తయినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే...సైరా షూటింగ్ జరిగిన సెట్స్ లోనే చిరు 152వ సినిమా మొదటి షెడ్యూల్ జరిగిందట. అలా జరగడానికి ముఖ్య కారణం చరణే అట. సైరా సెట్స్ చెక్కుచెదరకుండా ఉండటంతో...కొరటాలకు ప్రొడక్షన్ డిజైనర్స్ కు సైరా సెట్స్ ను కొంచెం మార్చి దానిలోనే షూటింగ్ చేయమని సూచించాడట. దీంతో కొరటాల చరణ్ చెప్పినట్టే చేసి మొదటి షెడ్యూల్ లో ఎంట్రీ సాంగ్ చిత్రికరణ మొదలు పెట్టారు.