
రానా దగ్గుబాటి తన బహుభాషా చిత్రం "హాతి మేరే సాతి", తెలుగులో "అరణ్య" విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. రానా దగ్గుబాటి తన మందపాటి గడ్డం, సన్నని ఆకారంలో కనిపించిన ‘అరణ్య’ టీజర్‌ను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు. అరణ్య, అడవిలో ఏనుగులను రక్షించడం చుట్టూ తిరుగుతుందని 75 సెకన్ల క్లిప్ సూచించింది. ఈ అడవి జంతువుల రక్షకుడు రానా దగ్గుబాటి. మానవ శక్తులు కాజీరంగ ఏనుగు కారిడార్‌పై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు, రానా దగ్గుబాటి మరియు విష్ణు విశాల్ పాత్రలు అడవి జంతువులను రక్షించడానికి, భద్రంగా ఉంచడానికి తమ జీవితాలను ఫళంగా పెడతారు. అయితే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరణ్య కోసం రానా దగ్గుబాటి మెకోవర్ చూసి ఫిదా అయ్యారు. స్నేహితుడైన రానా గురించి రామ్ చరణ్ ఫెస్బుక్ వేదికగా మెచ్చుకున్నాడు. "అరణ్య కోసం రానా మెకోవర్ చాలా బాగుంది. కధ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది" అంటూ ప్రశంసలు కురిపించారు.