
రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. రాజమౌళి సినిమా తర్వాత రామ్ చరణ్ ఎం సినిమా చేస్తాడు.? ఎవరితో చేస్తాడు ? అన్న ప్రశ్నలు అందరిలో నెలకున్నాయి. ఇప్పటికే టాప్ డైరెక్టర్లు అయిన క్రిష్, వంశీ పైడిపల్లి రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుండగా మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చెర్రీ తదుపరి సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ మంచి విజయం సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు హరీష్ శంకర్. తన హీరోలను అన్ని రకాల మాస్ యాంగిల్స్ లో చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. రామ్ చరణ్ కు సెట్ అయ్యే మాస్ కథను సిద్ధం చేస్తున్నారట. గతంలో కూడా రాంచరణ్ మాస్ కథలలో నటించాడు. ఆ చిత్రాలన్నింటికంటే ఈ చిత్రం విభిన్నంగా ఉంటుందట. మరి హరీష్ శంకర్ రెడీ చేస్తున్న ఈ కధ ఎంతవరకు చెర్రీకి సెట్ అవుతుందో చూడాలి.