
స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి అక్కినేని అఖిల్ సినిమా ప్రకటన ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇది అఖిల్ 5వ చిత్రం అవుతుంది. మంచి డైరెక్టర్ చేతిలో అఖిల్ పడ్డాడని అతని అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ పొందుతారని వారు ఆశిస్తున్నారు. అయితే పరిశ్రమ చుట్టూ తిరుగుతున్న ఒక ఆసక్తికరమైన వార్త ఏమిటంటే...ఈ కలయిక ను సెట్ చేయడంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించారట. 'ధ్రువ', 'సైరా నరసింహారెడ్డి' చిత్రాలకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి రామ్ చరణ్ కు మంచి స్నేహితుడు. అలాగే చరణ్ అఖిల్‌ను తన తమ్ముడిగా భావిస్తాడని తెలుసు. కాబట్టి అఖిల్ మరియు సురేందర్ రెడ్డిలను జత కట్టించాలని నిర్ణయించుకుని.... సురేందర్ రెడ్డితో స్వయంగా తనే మాట్లాడి అఖిల్ కు మంచి బ్రేక్ ఇవ్వాల్సిందిగా కోరాడట. అఖిల్‌కు ప్రస్తుతం పెద్ద హిట్ చాలా అవసరం అందుకే అక్కినేని హీరోతో కలిసి పనిచేయాలని చరణ్ సురేందర్ రెడ్డిని ఒప్పించాడు. దానితో పాటు, ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మించడంలో కూడా చరణ్ పాత్ర ఉందని సమాచారం. ఎకె ఎంటర్టైన్మెంట్స్ త్వరలో చిరంజీవి చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇవి సినీ సిర్కిల్స్ లో వినిపిస్తున్న పుకార్లు మాత్రమే ఇందులో ఎంతమాత్రం నిజముందో తెలియాలంటే ఎవరో ఒకరు అధికారికంగా చెప్పాల్సిందే. కానీ ఇదే కనుక నిజమైతే మా హీరో అందుకే గొప్పవాడని చరణ్ అభిమానులు, తమ హీరో కోసం ఎంత చేస్తున్నాడని అఖిల్ అభిమానులు ఫుల్ కుష్ అవ్వడం పక్కా.