
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన "భారత్ అనే నేను" సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది కీయరా అద్వానీ. తన నటనా, హావభావాలతో మెప్పించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి "వినయ విధేయ రామ" సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఆమె స్థాయి మేరకు అందచందాలతో ఆకట్టుకున్నా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో సౌత్ లో ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. ఇంతలో బాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్ అయిన "కబీర్ సింగ్" లో ఆఫర్ రావడం అది బ్లాక్ బస్టర్ అవ్వడం...ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు రావడంతో కీయరా ప్రస్తుతం మంచి ఊపు మీదుంది. ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ ను కూడా ఎంజాయి చేస్తుంది. బీ టౌన్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్న కీయరా అతనితో ఆఫ్రికా అందాలను వీక్షించింది. ట్రిప్ ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ జంట కెమెరాలకు చిక్కారు.