
చిత్ర పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం సుజీత్తో కలిసి పనిచేయాలని ఆలోచిస్తున్నాడు. 'రన్ రాజా రన్' చిత్రంతో సుజీత్ దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత ప్రభాస్ మరియు శ్రద్ధా కపూర్ నటించిన యాక్షన్ డ్రామా 'సాహో'కు దర్శకత్వం వహించాడు. సాహో దర్శకుడు సుజీత్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి పనిచేయనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, రామ్ చరణ్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన వెంటనే చరణ్ సుజీత్తో కలిసి సినిమా ప్రారంభించనున్నాడు. అన్ని కుదిరితే, రామ్ చరణ్ మరియు సుజీత్ యొక్క రాబోయే ప్రాజెక్ట్ను యువి క్రియేషన్స్ నిర్మించనుంది. ఏదేమైనా, మేకర్స్ దినిపై కొనసాగుతున్న ఉహాగానాలను క్లియర్ చేయాల్సి ఉంది.