
రాజమౌళితో సినిమా చేస్తున్న ఏ హీరో అయినా సరే నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడన్న ఆసక్తి ఉంటుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో ఆ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇంకా రిలీజ్ అవ్వనే లేదు కానీ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే అందరి కళ్ళు. ఈ నేపథ్యంలో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నాడని, సుకుమార్ తో స్క్రిప్ట్ డిస్కషన్స్ అవుతున్నాయని చాలానే రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. అది మరెవరో కాదు మహేష్ తో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ను సినిమాలో పొందుపరిచే అనిల్, చరణ్ తో కలిసితే ఫ్యాన్స్ కు పండగే. ఏదేమైనా చరణ్ నుండి అధికార ప్రకటన వస్తే కానీ ఏది నమ్మడానికి లేదు.