
మెగా ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టిన మరో హీరో వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ తేజ్ ను పరిశ్రమకు స్వాగతించి, అతనికి అన్ని విజయాలు దక్కాలని కోరుకుంటూ, బంధువు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు మహా శివరాత్రి సందర్భంగా "ఉప్పేన" యొక్క కొత్త పోస్టర్ను విడుదల చేశారు. కృతి శెట్టి ముఖం మీద ఆహ్లాదకరమైన చిరునవ్వుతో నల్ల దుస్తులు ధరించి అందంగా కనిపిస్తుండగా, రగడ్ అవతారంలో ఉన్న వైష్ణవ్ తేజ్, పోస్టర్లో ఆమెను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రంలో ప్రధాన జంట మధ్య అందమైన కెమిస్ట్రీ ఉంటుందని తెలుస్తోంది. "సుస్వాగతం వైష్ణవ్ తేజ్, ఈ జర్నీని నువ్వు కచ్చితంగా ఎంజాయ్ చేస్తావు. నీకు అన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నానని" ఉప్పెన" టీంకు అల్ ది బెస్ట్ చెప్పాడు రామ్ చరణ్. బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఉప్పెన"ను మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న విడుదల కానుంది.