
హైదరాబాద్లో డాక్టర్ దిశాపై జరిగిన అత్యాచారం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ కదిలించింది. ఉన్నత భవిష్యత్ ఉన్న డాక్టర్ ను రేప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి, అతి క్రూరంగా చంపిన నిందితులను వారం రోజుల లోపే పట్టుకొని, ఘటనా స్థలంలొనే చివరకు ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. అయితే, నిజ జీవిత సంఘటనలపై తన సినిమాలను ఎప్పుడూ బేస్ చేసుకునే కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఈ భయానక సంఘటనపై సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వర్మ ఈ రోజు ఈ ప్రాజెక్టును ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. " నా నెక్స్ట్ సినిమా పేరు 'దిశా'. దిశా రేప్ గురించి ఈ సినిమా ఉంటుంది. నిర్భయ లాంటి క్రూరమైన, కిరాతకమైన చర్య తర్వాత దిశా నిందుతులు ఇంకా క్రూరంగా ఆమెను పెట్రోల్ పోసి కాల్చి తగలబెట్టారు" అని పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.