
రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ అయిన ఇండో చైనీస్ చిత్రం "ఎంటర్ ది గర్ల్ డ్రాగన్" తో బిజీగా ఉన్నారు. చైనీస్ సహకారంతో భారతదేశం యొక్క మొదటి మార్షల్ ఆర్ట్స్ గురించి సాగే కధ. అందుకే షూటింగ్లో కొంత భాగం చైనాలో, కొంత భారతదేశంలో చిత్రికరించబడింది. అయితే ఇటీవల చైనాలో 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' యొక్క కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి అర్జీవి చైనా వెళ్లేందుకు ప్లాన్ వేసినప్పుడు, కరోనా వైరస్ బయటపడింది. ఇది కాస్త చిత్ర దర్శకుడిని నిరాశపరిచింది. చైనాలో పలు కీలకమైన ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించడం కోసం స్టంట్ కొరియోగ్రాఫర్లు, ఇతర తారాగణం మరియు సిబ్బంది చైనాకు ప్రయాణించాల్సి ఉంది, కాని కరోనావైరస్ దాడితో, షెడ్యూల్ కనీసం 3 నెలలు పోస్ట్ పోన్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. రామ్ గోపాల్ వర్మ 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' తన కెరీర్ లొనే బెస్ట్ పిక్చర్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి.