
చాక్లెట్ బాయ్ నుంచి ఎనర్జిటిక్ స్టార్ గా మారిన రామ్ పోతినేని సినిమా సినిమాకి యాక్టింగ్ లో, డ్యాన్స్ లో ఇంప్రూవ్ అవుతూ అభిమానులను, ప్రేక్షకులని మెప్పిస్తునే ఉన్నాడు. తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన 'రెడ్' సినిమాత్ యాక్టింగ్ పరంగా రామ్ మరో మెట్టు ఎక్కాడు. లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో వచ్చిన సినిమాల్లో రెడ్ ఒకటి. మొదట ప్రేక్షకులు వస్తారో రారోనని అనుకున్న టీం సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసి ఖుష్ అయ్యారు. అయితే రెడ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ట్రిపుల్ ఆర్ లో కనిపించబోతున్నాడు రామ్. ట్రిపుల్ ఆర్ అంటే, త్రిపాత్రాభినయంలో రామ్ కనిపించనున్నాడు. ఒకే సినిమాలో మూడు భిన్నమైన పాత్రలను పోషించబోతున్నాడని సినీ సర్కిల్స్ వినిపిస్తున్న టాక్. ఇక కమర్షియల్ యాంగిల్ తో ఛాలెంజింగ్ గా ఉండే కథ రామ్ వద్దకు వచ్చిందని అది చేసేందుకు కూడా రెడీ అవుతున్నాడని సమాచారం.