
రాజమౌళితో సినిమా అంటే మినిమమ్ రెండేళ్లు లాక్ అయినట్లే. అదీ, బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రాజమౌళి ఔట్పుట్ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడో, దానికోసం ఇంకెంత సమయం తీసుకుంటాడో తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. అసలే జక్కన్న లేటు అందులోనూ కరోనా రావటంతో మరీ ఆలస్యం కానుంది. అందుకే కనీసం ఆర్ఆర్ఆర్ పూర్తి అయ్యిఅవ్వగానే వరుస బెట్టి సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యి అద్భుతమైన లైనప్ చేసుకున్నాడు. ఎవరి తర్వాత ఎవరితో సినిమా చేస్తాడన్న క్లారిటీ లేదు కానీ డైరెక్టర్లు మాత్రం ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారు. వారే...వంశీపైడిపల్లి, భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల, జెర్సీ సినిమాను డైరెక్ట్ చేసిన గౌతమ్, అనిల్ రావిపూడి, కొరటాల శివ వంటి డైరెక్టర్లతో ఇప్పటికే కథలు ఓకే అయ్యి సినిమాను లాక్ చేసినట్లు తెలుస్తోంది. మరి జక్కన్న సినిమా తర్వాత చెర్రీ సినిమా యేడాదికోటి వస్తుందేమో చూడాలి.