
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రంపై అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తాజాగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్లో చిరంజీవి జాయిన్ అయ్యారు. మరోవైపు రామ్ చరణ్ కూడా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయిదానుకునే లోపు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా రామ్ చరణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీనితో ‘ఆచార్య’ సెట్లో అడుగు పెట్టాడు. ఈ రోజు నుంచి రామ్ చరణ్.. ఆచార్య రెగ్యులర్ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా మా ‘సిద్ధ’ సర్వం అంటూ దర్శకుడు కొరటాల శివ.. రామ్ చరణ్‌కు స్వాగతం పలికాడు.