
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం అవ్వటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. రామ్ చరణ్ సరసన బీ టౌన్ బ్యూటీ అలియా భట్ నటిస్తుంది. వచ్చే ఏడాది జులై30కు రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్ ఈమేరకు షూటింగ్ ను చకచకా పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కొన్నిరోజుల క్రితం మెగాస్టార్ తన ఇంట్లో ఆరెంజ్ చేసిన రీ యూనియన్ పార్టీలో చరణ్ తళుక్కుమన్నాడు. ఆ పార్టీ ముగిసి చాలా రోజులే అవుతున్న ప్రజలు ఇంకా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది చూసిన చరణ్...ఈ తరం సౌత్ తారలను ఒక స్టేజ్ పైకి తీసుకొచ్చి ఇలా పార్టీ ఇస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. ఇదే కనుక నిజమైతే ఇండస్ట్రీలో నేటి తారలతో గెట్ టూ గెదర్ పెట్టిన మొదటి వ్యక్తి అవుతారు.