
మాజీ కథానాయిక రమ్య కృష్ణ ఇద్దరు యువ హీరోలకు తల్లిగా నటించడానికి సిద్ధంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం, గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో నటిస్తున్న బాక్సింగ్ డ్రామ చిత్రంలో అలానే, విజయ్ దేవరకొండ హీరోగా తాత్కాలికంగా 'లిగర్' పేరుతో పిలవబడుతున్న పూరి జగన్నాధ్ స్పోర్ట్స్ డ్రామలో రమ్య కృష్ణ నటించనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రెండు సినిమాలను పాన్-ఇండియన్ చిత్రాలుగా ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి హిందీలో కూడా విడుదల అవుతాయి. బాహుబలి సినిమాలో శివగామిగా రమ్య పవర్ ఫుల్ నటన తర్వాత నార్త్ లో రమ్య కృష్ణకు ఆదరణ పెరిగింది. ఈ రెండు సినిమాల్లో రమ్య హీరోలకు తల్లిగా కనిపించనుంది. మరి రమ్య కృష్ణ తన పాత్రలతో ఎలా అలరిస్తుందో చూడాలంటే మనం కొన్ని నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫెమస్ లవర్ కొంనో రోజుల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.