
ఫుల్ ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో "ఫైటర్" అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పూరి, ఛార్మిలతో సహా బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. విజయ్ కు హిందీలో కూడా మంచి మార్కెట్ ఉండటంతో ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే సినిమాలో విజయ్ తల్లిగా రమ్యకృష్ణ కనిపించనుంది. దీనికోసం ఆమె రెమ్యునరేషన్ లో కూడా కాంప్రమైజ్ అయిందట. బాహుబలి తర్వాత సినిమాకు పది నుంచి పదిహేను లక్షలు తీసుకుంటున్న రమ్యకృష్ణ ఈ సినిమాకు సగానికి సగం తగ్గించేసిందట. పూరి, విజయ్ కు ఉన్న క్రేజ్ ఆమెకు ఉపయోగపడుతుందని రెమ్యునరేషన్ కూడా తగ్గించుకునేందుకు వెనకాడలేదట.