
కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ మాదిరిగానే టాలీవుడ్ కూడా మాదకద్రవ్యాల ఉచ్చును ఎదుర్కొంది. ఆ సమయంలో చాలా మంది సినీ తారల చుట్టూ అనేక పుకార్లు తలెత్తాయి. అల....డ్రగ్స్ మత్తుకు బానిస అయ్యారంటూ బాహుబలి స్టార్ రానా దగ్గుబాటిపై ఎన్నో రూమర్లు వినిపించాయి. అయితే రానా తండ్రి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఆ వార్తలను ఖండించారు. కానీ ఈ వివాదం రానాకి ఇప్పటికి వదలడం లేదు. తాజాగా జరిగిన ఓ జాతీయ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానాను టాలీవుడ్ డ్రాగ్ మాఫియాలో మీ పేరు కూడా వినిపిస్తుంది. అందులో నిజమెంత? అని అడగగా...దానికి రానా, నేను రోజు 20 కిలోమీటర్లు పరిగెడతాను. గంటల తరబడి పని చేస్తాను. డ్రగ్స్ తీసుకునే వారు ఎవరైనా సరే ఇంత వర్క్ అవుట్ చేయగలరా? నేను బాలీవుడ్ పార్టీస్ కి వెళ్లినంత మాత్రాన నేను కూడా డ్రగ్స్ మత్తులో ఉన్నానని కాదని సీరియస్ అయ్యారు.