
రానా దగ్గుబాటి మరి సన్నబడడంతో అతని ఆరోగ్యం బాగోలేదని కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో చికిత్స కోసం విదేశాలకు వెళ్లారని ఎన్నో పుకార్లు వచ్చాయి. కానీ ఏ రోజు రానా దీనిపై నోరు విప్పలేదు. అయితే తాజాగా సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'సామ్ జామ్' షోకి వచ్చిన రానా దగ్గుబాటి తన ఆరోగ్య పరిస్థితి కుండ బద్దలు కొట్టాడు. చిన్నప్పటి నుంచి బిపి ఉందని దాని వాళ్ళ గుండె సమస్య తలెత్తుతుందని... కిడ్నీలు పాడవుతాయని వైద్యులు చెప్పారని, అలాగే, మెదడులో నరాలు చిట్లిపోవడానికి 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉందని వైద్యులు చెప్పారంటూ కంటితడి పెట్టాడు. జీవితంలో వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిన్న పాజ్ బటన్ ఇదని పేర్కొన్నాడు. ఇది విన్న సమంత నేను నిన్ను ప్రత్యేక్షంగా చూసాను....ఎవరు ఎన్ని అంటున్న రాయిలా నిలబడవ్వు నీకు హ్యాట్స్ అఫ్ అంటూ రానా గుండె ధైర్యాన్ని మెచ్చుకుంది.