
ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న, నడుస్తున్న చర్చ ప్రముఖ నటుడు దివంగత శోభన్ బాబు బయోపిక్ గురించే. తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసి నటి సావిత్రి బయోపిక్ ను 'మహానటి' పేరుతో తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి బయోపిక్ ల హవా పెరిగింది. ఈనేపథ్యంలో అందగాడుగా అభిమనులు ప్రేమించిన దివంగత నటుడు శోభన్ బాబు బయోపిక్ ను రాసే పనిలో పడ్డారట పలు రచయితలు. అయితే ఎప్పుడైతే ఈ బయోపిక్ తెరకెక్కుతోందని వార్తలు వచ్చాయో అప్పటి నుంచి శోభన్ బాబుగా రానా రగ్గుబాటి నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. శోభన్ బాబును మరిపించే విధంగానే రానా ఉంటారని అందుకే ఆయన్నే తీసుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో చూద్దాం.