
టాలీవుడ్ బడా నిర్మాత మరియు మూవీ మొఘుల్ డాక్టర్ దగ్గుబాటి రామనాయుడు మనవడు దగ్గుబాటి అభిరామ్ నిన్న హైదరాబాద్ మణికొండలో ఒక ప్రమాదానికి గురయ్యారు. అతని కారు ముందు నుండి వస్తున్న మరో కారును ఢీకొట్టిందని, తద్వారా ప్రమాదం క్షేణాల్లో జరిగిందని తెలుస్తోంది. కారు డ్రైవర్లు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు, కాని అభిరామ్ కారుకు కొంచెం డ్యామేజ్ జరిగింది. పెద్ద ఎత్తున ఎటువంటి ప్రమాదం జరగనందున ఇప్పటి వరకు పోలీసు కేసు ఏదీ నమోదు చేయలేదు. ఈసారి కారు ప్రమాదంతో వార్తల్లో నిలిచిన దగ్గుబాటి అభిరామ్ గతంలో నటి శ్రీరెడ్డి వివాదంతో వార్తల్లో నిలిచాడు. తనని మోసం చేశాడంటూ, వాడుకున్నాడంటూ నటి శ్రీరెడ్డి అభిరామ్ పై చేసిన ఆరోపణలపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇప్పటికి ఆ విషయంలో ఓ క్లారిటీ లేకపోయిన కాలక్రమేణా అది మరుగుణపడింది. ఇక తాజాగా అభిరామ్ అన్న బల్లాలదేవుడు మిహీకను పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన దగ్గుబాటి ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికి హల్చల్ చేస్తున్నాయి.