
రన్బీర్ కపూర్, అలియా భట్ మొత్తానికి ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకోబోతున్నారు. సినీ క్రిటిక్ రాజీవ్ మసంద్ అందించిన సమాచారం ప్రకారం, వారి కలిసి నటిస్తున్న 'బ్రహ్మస్త్రా'చిత్రం విడుదలైన వెంటనే ఈ వివాహం జరుగుతుంది. డిజిటల్ మ్యాగజైన్ ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్ చెప్పిన దాని ప్రకారం, అలియా భట్, రన్బీర్ కపూర్ డిసెంబరులో వివాహానికి అంగీకరించినట్లు వెల్లడించారు. ఇప్పటికే వీరి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. కపూర్, భట్ కుటుంబాలు వారి వేడుకలో చేరడానికి రోజులు కేటాయించాలని కోరారు. ఇటీవల, అలియా భట్, రన్బీర్ కపూర్ మరియు నీతు కపూర్ లతో కలిసి నటుడు కజిన్ అర్మాన్ జైన్ వివాహ రిసెప్షన్ కు వచ్చింది. వారు కలిసి స్టేజ్ వద్దకు వచ్చి ఫోటోలకు పోజులిచ్చారు. ఆ వేడుక నుండి వచ్చిన వీడియోలలో అలియా నీతును ప్రొటెక్ట్ చేస్తూ కనిపించింది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న రన్బీర్, అలియా మొత్తానికి డిసెంబర్ లో ముడుముళ్లతో ఒకటవ్వనున్నారు.