
'భీష్మ' సక్సెస్ తో మంచి హుషారుగా ఉన్న హీరో నితిన్ అదే జోష్ లో షాలినికి మూడు ముళ్ళు వేసి ఓ ఇంటివాడయ్యాడు. బ్యాచలర్స్ లిస్ట్ లో నుంచి బయటికొచ్చేసాడు. అయితే నితిన్ తదుపరి చిత్రం 'రంగ్‌దే' టీం పెళ్లి కానుకగా టీజర్ ను రిలీజ్ చేసింది. టీజర్ విషయానికొస్తే....ఏజ్ పెరుగుతున్న ఎక్కడ దానికి రుజువు లేకుండా చూసుకుంటున్నాడు నితిన్. అంతే హ్యాండ్సమ్ గా ట్రిమ్ అండ్ స్లిమ్ గా ఉన్నాడు. కీర్తి సురేష్ సినిమాలో నితిన్ ను ఒక అట ఆడుకోబోతుందని అర్ధం అవుతుంది. టీజర్ బ్యాక్‌డ్రాప్ లో వచ్చే 'బస్ స్టాండే.. బస్ స్టాండే' అనే పాట హైలైట్ గా నిలిచింది. మొత్తానికి టీజర్ చూస్తే ఫన్ ఫీల్డ్ బ్లాక్ బస్టర్ పడేలానే ఉంది. అన్ని బాగుంటే సంక్రాంతికి థియేటర్లలో కలుద్దామని చెప్పిన టీం కలుస్తుందో లేదో చూడాలి.