
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి "దిశ యాక్ట్" ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ రేప్ అండ్ మర్డర్ దృశ్య ఈ యాక్ట్ కు దిశ అని పేరు పెట్టారు. మరో ఆడపిల్ల ఇలాంటి బాధను, నరకంను అనుభవించకుండా చూసేందుకు తగిన చర్యగా ఈ యాక్ట్ ను ప్రవేశపెట్టారు. దిశ యాక్ట్ ప్రకారం నేరం జరిగిన 21 రోజుల్లోనే విచారణ, నిందితులను పట్టుకోవడం, వాళ్లకు తగిన శిక్ష పడటం జరిగిపోవలని దిశానిర్దేశం చేశారు. అంతేకాదు సాక్ష్యాలతో నిందితులను పట్టుకున్నాక వాళ్ళు పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ యాక్ట్ పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాజాగా మీడియాతో ముచ్చటించిన రాశిఖన్నాను దిశ యాక్ట్ పై తన అభిప్రాయాన్ని అడగగా...."దిశ యాక్ట్ చాలా బలమైంది. అమ్మాయిలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారిలో భయాన్ని తెస్తుందని" ఆమె సమాధానం ఇచ్చారు.