
దర్శకుడు పరశురాం మహేష్ బాబుతో సినిమా చేసినా, చేయకపోయినా, నాగ చైతన్యతో అతని చిత్రం మాత్రం అతి త్వరలో షూటింగ్ ప్రారంభించనుంది. 14 రీల్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. వారు త్వరలో షూట్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతుండగా, చై మరియు దర్శకుడు ఇద్దరికీ ప్రొడ్యూసర్ నుండి షాక్ తగిలింది. అదేంటంటే, హీరోయిన్ ను మార్చాలని నిర్మాత పట్టుబడుతున్నారు. వాస్తవం ఏమిటంటే, రష్మిక మందన్న నటించిన తాజా చిత్రాలు 'సరీలేరు నీకెవ్వరు', 'భీష్మ' తో సహా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అయితే, అయినాసరే ఆమెను మార్చాలని నిర్మాతలు కోరుతున్నారు. వాస్తవానికి వారు వారి వాల్మీకి సినిమా చేసినప్పుడు డస్కీ బ్యూటీ పూజా హెగ్డేకు పెద్ద మొత్తంలో అడ్వాన్స్ చెల్లించినట్లు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు, వారు ఈ ప్రాజెక్ట్ కోసం ఆమెను తీసుకోవాలని భావిస్తున్నారు. పరుశురాం తనకు గీతా గోవిందం లాంటి మంచి హిట్ ఇచ్చిన హీరోయిన్ ను పక్కన పెట్టడానికి సంకోచిస్తున్నప్పటికి నిర్మాతల మాట వినక తప్పేటట్టు లేదు.