
త్రివిక్రమ్ శ్రీనివాస్ మే నుండి మాత్రమే ఎన్టీఆర్ సినిమా షూట్ ప్రారంభించబోతున్నప్పటికి, ఈ సినిమా హీరోయిన్ విషయంలో చాలా పుకార్లు ఉన్నాయి. దర్శకుడు పూజ హెగ్డేతో హ్యాట్రిక్ పూర్తి చేయాలనుకుంటున్నాడని, మరోవైపు అతను కీలక పాత్ర కోసం సమంతను తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నాడని పుకార్లు ఉన్నాయి. ఫిల్మ్ నగర్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం, వాస్తవానికి త్రివిక్రమ్ ఇప్పటికే రష్మిక మందన్నను ఈ చిత్రానికి హీరోయిన్ గా తీసుకున్నాడని, ఆమె అగ్రిమెంట్ పై సంతకం కూడా చేసినట్లు సూచిస్తున్నాయి. 'భీష్మ' కోసం సీతారా ఎంటర్టైన్మెంట్ కు రష్మిక సంతకం చేసిన సమయంలో, వారి పేరెంట్ బ్యానర్ హరిక హాసినితో మరొక చిత్రానికి కూడా హీరోయిన్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం, రష్మిక ఎన్టీఆర్ 30వ సినిమా కోసమే సంతకం చేసిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎటుపోయి ఎటొస్తుందోనని రష్మీక ఎన్టీఆర్ సినిమాకు సైన్ చేసినట్లు ప్రకటించలేదని అంచనా వేస్తున్నారు.