
వెండితెరపై అందమైన జంటలు చాలానే ఉంటాయి. అయితే.., ఈ మధ్య కాలంలో బుల్లితెరపై కూడా ఇలాంటి క్యూట్ కపుల్స్ పుట్టుకొచ్చారు. వీరిలో మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్ రశ్మి- సుధీర్ జోడీ. ఎంతో కాలం నుండి వీరిద్దరూ కలసి హోస్ట్ చేస్తున్న పోగ్రామ్స్ అన్నీ హయ్యెస్ట్ రేటింగ్ తో దూసుకుపోతోన్నాయి. ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న ఏ అంశాన్ని అయినా.. మేకర్స్ క్యాష్ చేసుకోవాలనే అనుకుంటారు. ఇందులో భాగంగానే ఇప్పుడు సుధీర్- రశ్మి జోడీతో మూవీ కోసం ప్రయత్నాలు వేగం అందుకొన్నాయి. తమపై వచ్చే అన్నీ వార్తలకు స్పందించడం ఈ పెయిర్ కి ముందు నుండి అలవాటే. ఇందులో భాగంగానే.. "తమ కలయికలో సినిమాపై కూడా రశ్మి నోరు విప్పింది. "మా ఇద్దర్నీ జంటగా పెట్టి సినిమాలు చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ.., మంచి కథ సెట్ అవ్వడం లేదు. అలాంటి కథ సెట్ అయినప్పుడు కచ్చితంగా మేమిద్దరం సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తామని" రశ్మి తెలియచేసింది. ఇక ఇదే క్రమంలో.. సుధీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ హాట్ బ్యూటీ. "తను చూసిన వ్యక్తుల్లో మోస్ట్ రొమాంటిక్ వ్యక్తి సుధీర్. సుధీర్ ఎవ్వరితో డేటింగ్ చేసినా, పెళ్లి చేసుకున్నా మొదటి 6 నెలలు ఆ అమ్మాయికి సినిమాటిక్ లైఫ్ చూపిస్తాడని" ఓపెన్ గానే చెప్పేసింది రశ్మి.