
'పుష్ప' అవుట్ డోర్ షూటింగులో చాలా కష్టపడుతున్నానని అంటోంది అందాలభామ రష్మిక. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్నాళ్లుగా అవుట్ డోర్ లొకేషన్స్ లో జరుగుతోంది. దీనిపై అక్కడ తన అనుభవాన్ని రష్మిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. "మా బస నుంచి షూటింగ్ లొకేషన్ చాలా దూరం కావడంతో తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేవాల్సి వస్తోంది. ఇక షూటింగ్ పూర్తిచేసుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అవుతోంది. ఆ తర్వాత వర్కౌట్లు, డిన్నర్ పూర్తి చేసి పడుకునే సరికి 12 అవుతోంది. మళ్లీ పొద్దున్నే నాలుగు గంటలకే లేవాలి. అంటే నేను పడుకునే సమయం రోజుకి కేవలం 4 గంటలే. అలాగే, ఈ సినిమాలో నాకు స్పెషల్ మేకప్ అవసరం అవుతోంది. దీనికి రెండు గంటలు వెచ్చించాల్సివస్తోంది. ఇదొక ఛాలెంజ్ లాంటిది. అయినా, రేపు స్క్రీన్ మీద మంచి రిజల్ట్ వస్తుందిలెండి" అని చెప్పింది.