
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు" సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ నెలకు తక్కువే ఉండటంతో వచ్చే నెల 5న గ్రాండ్ గా ప్రి రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్సమెంట్ కూడా చిత్ర యూనిట్ తాజాగా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా ప్రతి మండే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు సినిమాకు సంబంధించిన ఏదోక అప్డేట్ ఇస్తామంటూ ప్రకటించిన టీం అన్నట్లుగానే గత రెండు వారాలుగా పాటలను రిలీజ్ చేస్తూ వచ్చింది. ఇక ఈ వారం కూడా "హి ఈజ్ సో క్యూట్" అనే పాటను రిలీజ్ చేసింది. ఈ పాటలో రష్మీక మందన్న మహేష్ ను టీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.