
ప్రెట్టీ డాల్ రష్మిక మందన్న ఈవేళ టాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయికలలో ఒకరు. ఇక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అత్యధిక పారితోషికాన్ని అందుకుంటోంది. అలాగే, కన్నడ సినిమా రంగంలో కూడా తను బిజీనే. అక్కడ కూడా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. మరోపక్క ఇటీవలే బాలీవుడ్ మీద కూడ కన్నేసింది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న 'మిషన్ మజ్ను' సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ క్రమంలో ఈ అందాలభామ బాలీవుడ్ లో మరో క్రేజీ ఆఫర్ ను అందుకుంది. ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలో కథానాయికగా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. వికాస్ భల్ దర్శకత్వంలో అమితాబ్ ప్రధాన పాత్రధారిగా రూపొందే సినిమాలో నటించడానికి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే అనుబంధాలు, భావోద్వేగాల కథతో రూపొందే ఈ చిత్రంలో అమితాబ్ కు కూతురిగా రష్మిక నటిస్తుంది. ఇందులో ప్రముఖ నటి నీనా గుప్తా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే మార్చి నెలలో మొదలవుతుంది.