
కన్నడ నటి రష్మీక మందన్న ప్రస్తుతం తెలుగులో కూడా వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. తెలుగు ఇండస్ట్రీలోకి రాకముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మీక నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కాని నిశ్చితార్థం జరిగిన కొంత కాలానికే బ్రేక్ అయ్యింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి బ్రేకప్ పై రెండేళ్ళుగా పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మీక తన బ్రేకప్ పై స్పందించింది. "కన్నడలో రక్షిత్ శెట్టితో కిరిక్ పార్టీలో నటించాను. ఆ సమయంలోనే మేము ఇద్దరం ప్రేమలో పడ్డాం. వెంటనే నిశ్చితార్థం చేసుకున్నాం. ఆ తర్వాత తెలుగులో నాకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలాంటి సమయంలో పెళ్లి చేసుకుంటే అటు పెళ్లికి, ఇటు సినిమాలకు న్యాయం చేయలేనని అనిపించి విడిపోయాము. కానీ రక్షిత్ ఇప్పటికి నాకు మంచి స్నేహితుడు. అతని మీద అదే గౌరవం ఉందని" తెలిపింది. మరి రష్మీక ఇచ్చిన ఈ క్లారిటీతోనైన పుకార్లుకు చెక్ పడుతుందేమో చూడాలి.