
'అరవింద సమేత' తరువాత, జూ. ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ రెండవ సారి చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వేసవిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. 2021 సంక్రాంతికి ఈ చిత్రంను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా తాజా సెన్సేషనల్ బ్యూటీ రష్మిక మందన్నను త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్లు ఉహాగానాలు చెలరేగాయి. మహేష్ మరియు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన తరువాత, ఆమె ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంటే ఇది రష్మిక నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన 'అల...వైకుంఠపురములో' సంక్రాంతికి రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.